Gun misfires : గన్ మిస్ ఫైర్... అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
గన్ మిస్ ఫైర్(Gun misfires) ఘటన అమెరికా(America)లో ఓ హైదరాబాద్ యువకుడి(Aryan Reddy) ప్రాణాలు తీసింది.
దిశ, వెబ్ డెస్క్ : గన్ మిస్ ఫైర్(Gun misfires) ఘటన అమెరికా(America)లో ఓ హైదరాబాద్ యువకుడి(Aryan Reddy) ప్రాణాలు తీసింది. పుట్టినరోజే ఆ యువకుడి జీవితంలో చివరి రోజుగా మారింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఉప్పల్ కు చెందిన విద్యార్థి ఆర్యన్ రెడ్డి (23 ) హంటింగ్ లైసెన్సుడ్ గన్ ను శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. తన పుట్టిన రోజు 13వ తేదీనే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు ఇక తిరిగిరాడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.
బీబీనగర్ పోచంపల్లి మండలం పెద్దరావుల పల్లి గ్రామానికి చెందిన వ్యాపారి పాల్వాయి సుదర్శన్ రెడ్డి, దీప దంపతులు ఉప్పల్ బ్యాంక్ కాలనిలో నివాసముంటున్నారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు పాల్వాయి అరుణ్ రెడ్డి (24) గత ఏడాది డిసెంబర్లో అమెరికాలోని జార్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలోని కెనిస్వా యూనివర్సిటీలో ఉన్నత విద్య ఎంఎస్ చదువుకునేందుకు వెళ్లాడు. ఈ నెల 13న తన గదిలోనే స్నేహితుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అరుణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అదే రోజు ఉదయం 10 గంటల సమయంలో తన హంటింగ్ లైసెన్స్ డ్ గన్ ను శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో తూటా అరుణ్ ఛాతీలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తండ్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు.
తన కుమారుడికి ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేదని, అందులో భాగంగానే గన్ పేల్చడంలో శిక్షణ కూడా పొందుతున్నాడన్నారు. అమెరికాలో గన్ కొనుగోలు చేసిన విషయం తనకు తెలియదన్నారు. సాధారణంగా తర్పీదు పొందిన వారికి హంటింగ్ కోసం గన్ కొనడానికి లైసెన్స్ ఇస్తారని తెలిపారు. అలా లైసెన్స్ ఇవ్వడం వల్లే తన కుమారుడు అసువులు బాశాడని సుదర్శన్ విలపించారు. ఈరోజు మృతదేహాన్ని అమెరికా నుంచి ఉప్పల్ లోని స్వగృహానికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.