GROUP-I: గ్రూప్-1 పొస్టులకు రికార్డు స్థాయిలో దరఖాస్తుల వెల్లువ.. ఇప్పటి వరకు వచ్చినవి ఎన్నో తెలుసా?

563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గాను ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్‌‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-03-17 16:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గాను ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) నోటిఫికేషన్‌‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసేంత వరకు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అప్లయ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్‌సీకి 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 503 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష నిర్వహించే సమయంలో బయోమెట్రిక్ తీసుకోకపోగా, హైకోర్టు తీర్పుతో మరోసారి పరీక్షను రద్దు చేశారు. ఫలితంగా ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. అదనంగా మరో 60 పోస్టులతో సహా 563 గ్రూప్-1 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు 503 పోస్టులకు 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు 563 పోస్టులకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.  

Tags:    

Similar News