తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌) నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2024-03-14 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌) నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని విద్యాశాఖ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం డీఎడ్‌, బీఎడ్‌ పాసైన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతేనే ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే టీఆర్‌టీ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. టెట్‌లో అర్హత లేకపోతే ఈ పరీక్షలు రాయడానికి వీలుండదు. అయితే, ఇప్పటికే 11,062 పోస్టులతో ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News