అసెంబ్లీ సాక్షిగా సోనియాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన గవర్నర్ తమిళి సై

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.

Update: 2024-02-08 06:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. యువకుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో కలిసివచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. తెలంగాణ ఇచ్చిన అప్పటి మన్మోహన్ సర్కారుకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోందన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటికి 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారు. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పాటిస్తుందని బీఆర్ఎస్‌కు చురకలు అంటించారు. గత ప్రభుత్వ నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు. దావోస్ సమావేశంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు.


Similar News