Tammineni : రైతుల ఆందోళనను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల (Lagacharla)గ్రామంలో కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటన రైతుల ఆగ్రహాన్ని సూచిస్తోందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Veerabhadram) అన్నారు
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల (Lagacharla)గ్రామంలో కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటన రైతుల ఆగ్రహాన్ని సూచిస్తోందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Veerabhadram) అన్నారు. ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్మా కంపెనీ కోసం రైతులు తమ భూములను కోల్పోవడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్, అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ నిరసనలతో ప్రారంభమై ప్రతిఘటనకు దారితీసిందని గుర్తు చేశారు. రైతులపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల భూములను లాక్కోవద్దన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ఫార్మాసిటీపై ఎన్నికల ముందు ఇచ్చిన మాట మార్చడంతో అక్కడ కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.