TS: అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త
అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
దిశ, వెబ్‌డెస్క్: అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను ఆదివారం నాడు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలోని 70వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌తో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. కాగా, తమ డిమాండ్లపై ప్రభుత్వ సానుకూల వైఖరిపై అంగన్‌వాడీ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.