గల్ఫ్​సెల్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కాంగ్రెస్ పార్టీ గల్ఫ్​కార్మికులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నది. గల్ఫ్​సెల్, ఎన్నారై పాలసీ పై తుది నిర్ణయం తీసుకోనున్నది.

Update: 2024-09-08 15:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ గల్ఫ్​కార్మికులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నది. గల్ఫ్​సెల్, ఎన్నారై పాలసీ పై తుది నిర్ణయం తీసుకోనున్నది. ఈ మేరకు గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనున్నది. త్వరలోనే ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతోనూ ప్రభుత్వం ఓ సమీక్షను నిర్వహించనున్నది. ఆదివారం టీపీసీసీ ఎన్నారై సెల్ ప్రతినిధి బృందం ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో భేటీ అయింది. గల్ఫ్​దేశాల్లో తెలంగాణ ప్రజలకు పడుతున్న కష్టాలను వివరించింది. మృతులను ఇళ్లకు చేర్చడానికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే అంశాలను వినతి పత్రం రూపంలో అందజేశారు.

త్వరలోనే గల్ఫ్​ప్రాంతాలకు వెళ్లే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం ఓ రివ్యూ నిర్వహించనున్నదని, సెప్టెంబర్ 17 లోపే గల్ఫ్​బాధితుల సంక్షేమం, పాలసీపై ప్రభుత్వ ప్రకటన ఉంటుందని వేం నరేందర్ రెడ్డి, ఎన్నారై సెల్ తో చెప్పినట్లు ఆయా ప్రతినిధులు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జి పీ. వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ వినోద్ కుమార్, గల్ఫ్ జేఏసీ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.


Similar News