జీఎచ్ఎంసీ ఆఫీస్, నెక్లెస్ రోడ్డును కూడా కూల్చేస్తారా.. హైడ్రా దూకుడుపై అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నల వర్షం

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. అక్రమంగా చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన నిర్మించిన కట్టడాలను ఈ హైడ్రా కూల్చివేస్తుంది.

Update: 2024-08-25 08:09 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హైడ్రా హాట్ టాపిక్‌గా మారింది. అక్రమంగా చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన నిర్మించిన కట్టడాలను ఈ హైడ్రా కూల్చివేస్తుంది. ఈ క్రమంలో పలు సంస్థలు, నిర్మాణాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో వారంతా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ్మడి కుంట చెరువు లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేయడం హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా అనేక అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయాలని హైడ్రాకు మద్దతు లభిస్తుంది.

ఇదిలా ఉంటే హైడ్రా దూకుడుపై అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. హైడ్రా కూల్చివేతలపై స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించాడు. అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు సరే.. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చివేస్తారా.. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు. గతంలో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నీటి కుంట ఉండేది.. దానిని పూడ్చి వేశారు. నెక్లెస్‌ రోడ్‌ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది. నెక్లెస్‌ రోడ్‌ను కూడా తొలగిస్తారా అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ హైడ్రా పై ప్రశ్నల వర్షం కురిపించారు. 


Similar News