కేసీఆర్‌ను ఓడించాలని చాలా మంది ట్రై చేశారు.. రేవంత్ ఈజీగా దించేశాడు
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్‌ను కొట్టడం కోసం ఎంతోమంది నాయకులు ప్రయత్నించారు.. కానీ రేవంత్ చాలా ఈజీగా కేసీఆర్‌ను గద్దే దించేసాడని అన్నారు. కేసీఆర్ సిగ్గు శరం వదిలి ప్రజలని దోచుకున్నారని ఆరోపించారు. అందుకే ఇప్పుడు బయటకు రావడానికి కూడా జంకుతున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ప్రభుత్వాన్ని సొంత ఆస్తి లాగా వాడుకున్నాడని తెలిపారు. రెడీగా ఉన్న పార్టీలో చేరి.. తండ్రి పేరు చెప్పుకొని పదవులు అనుభవించిన కేటీఆర్.. త్యాగాలు చేసి అలిసిపోయినట్లు మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. అమరవీరుల రక్తం తాగి వేలాది కొట్లు సంపాదించుకున్నారని అన్నారు.
ఓడిపోయిన తెల్లారి నుండే బయటకి వచ్చి.. ఓటమిని జీర్ణించుకోలేక ఇష్టమొచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని తెలిపారు. విలువల్లేని మనుషులు కేసీఆర్ కుటుంబ సభ్యులని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ నాయకత్వాన్ని చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తల దించుకోవాలి.. కేటీఆర్ దగ్గర ఎవరూ మిగలరని చెప్పారు. బీఆర్ఎస్‌లో చాలా మంది డబ్బుల కోసమే బతుకుతారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ రేవంత్ కాలి గోటికి కూడా సరిపోరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించదు అని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏ కారణం వల్ల ఓడిపోయారో చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉందా? అని ప్రశ్నించారు. సోనియా ఇచ్చిన తెలంగాణని తానే తెచ్చానని కేసీఆర్ డబ్బా కొట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.