Good News: రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అందుబాటులోకి ఆ సరుకులు

దేశంలోని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-08-21 08:47 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: దేశంలోని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రేషన్‌ షాపులను జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇక నుంచి రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటు ఉప్పు, పప్పులు, చిరు ధాన్యాలు, పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు నాణ్యమైన పోషకాలు అందించాలనే లక్ష్యంతో పాటు రేషన్‌ షాప్‌ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే ధ్యేయంగా పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించబోతున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. మొదటగా రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 60 రేషన్‌ షాపులను ‘జన్‌ పోషణ్‌’ కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నట్లు మంత్రి తెలిపారు. 

Tags:    

Similar News