Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది.
దిశ, డైనమిక్ బ్యూరో : భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు ప్రకటన విడుదల చేసింది. గురువారం నైరుతి కేరళ తీరాన్ని తాకినట్లు అధికారికంగా ప్రకటించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. కాగా, 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ, ఒకరోజు ముందుగా అవి దేశంలోకి ప్రవేశించాయి. మరో వారం రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ విషయాన్ని ఐఎండీ వెల్లడించింది. నేడు కేరళ తీరాన్ని తాకిన నైరుతి...తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. కేరళ నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి.