మద్యం ప్రియులకు తీపి కబురు.. హైదరాబాద్ మార్కెట్లోకి సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేద లిక్కర్

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని ఆదోళన అక్కర్లేకుండా హైదరాబాద్ మార్కెంట్లోకి బయో లిక్కర్ వచ్చేసింది.

Update: 2024-04-04 08:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని ఆదోళన అక్కర్లేకుండా హైదరాబాద్ మార్కెంట్లోకి బయో లిక్కర్ వచ్చేసింది. హైదరాబాద్ లో బయో లిక్కర్స్ అండ్ డిస్టలరీస్ సంస్థ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది. దేశీయంగా ఉత్పత్తి చేసిన బయో క్లాక్ డ్రింగ్స్ ఉత్పత్తుల ప్రీమియం శ్రేణిని బయో ఇండియా సంస్థ అధికారికంగా హైదరాబాద్ మార్కెంట్ లోకి ఈ మేరకు నిన్న బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో ఈ ఉత్పత్తులను రిలీజ్ చేయగా ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బి. శ్రీనివవాస అమర్ నాథ్ ఈ లిక్కర్ ను సృష్టించినట్లు సంస్థ పేర్కొంది. దీనికి యూఎస్ ఎఫ్ డీఏ అనుమతి కూడా లభించిందని, బయో విస్కీ, బయో బ్రాందీ, విస్కీ, వైల్డ్ ఫాక్స్, వోడ్కా ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో విక్రయించనున్నట్లు తెలిపింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బయో లిక్కర్ అని పేర్కొంది.

సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా:

మద్యపానం చేసే వారి అవయవాలపై చెడు ప్రభావం పడకూడదన్న లక్ష్యంతో వీటిని తయారు చేశామని వీటి తయారీలో ఎలాంటి సింథటిక్ రుచులు, రంగులు ఉపయోగించకుండా ఆయుర్వేద పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. తులసీ, అల్లం, లవంగ, యాలాకులు, అకాసియా, కలబంద, పసుపు, కొత్తిమీర, దాల్చిన చెక్క, జీలకర్ర, నల్లమిరాయలు, బ్లాక్ బెర్రీస్, చిరాటా, దుంప, మెంతులు, ఎలికంపెస్, జెనిటన్, రైజోమ్, గ్వారానా, రటానీ రూట్, సహజసిద్ధమైన వెనిల్లా, వలేరియన్, వెరోనికా, వైల్డ్ చెర్రీ, తేనే, బే ఆకులు, బ్రయోనియా రూట్ వంటి తదితర ఆయుర్వేద పదార్థాలతో వీటిని తయారు చేసినట్లు చెప్పారు.

నెటిజన్ల అనుమానాలు:

బయోలిక్కర్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ మద్యంపై ఏదైనా పరిశోధన ఉందా? అసలు ఇది నిజమేనా? పరిశోధన పత్రాలు ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అంటుూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీని తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలు ఆల్కహాల్ కు ప్రసిద్ధి అని ఇది ప్రతి పండ్లు కూరగాయలలో ఎక్కువగా కనిపిస్తాయని అందువల్ల ఈ ఆల్కహాలుకు బదులు నేరుగా పండ్లు కొని తినడం బెటర్ అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తంగా బయో లిక్కర్ తెలంగాణ మార్కెట్లోకి విడుదల కాగా దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News