తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. ట్విట్టర్ వేదికగా వెల్లడించిన KTR

తెలంగాణ రాష్ట్రానికి మరోసారి భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు గ్లాండ్ ఫార్మా రెడీ అయింది.

Update: 2023-02-20 09:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు గ్లాండ్ ఫార్మా రెడీ అయింది. రాష్ట్రంలో తమ కార్యకలాపాలు విస్తరించే పనిలో భాగంగా జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు గ్లాండ్ ఫార్మా ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో విస్తరణ పనులు చేపట్టిన గ్లాండ్ ఫార్మా.. విస్తరణ పనులతో అదనంగా 500 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఈ సంగతి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం లైఫ్ సెన్సెస్, జీనోమ్ వ్యాలీ రోజురోజుకు పెరుగుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Tags:    

Similar News