ఎల్బీ నగర్ చౌరస్తాకు ‘శ్రీకాంత్ చారి జంక్షన్’గా నామకరణం

హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుకంది.

Update: 2023-05-20 09:13 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుకంది. మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు.  రూ.32 కోట్ల వ్యయంతో 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు గల ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద నిర్మించింది. దీన్ని కొన్ని రోజుల ముందు మున్సిపల్ అండ్ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. ఎల్బీ నగర్ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి గౌరవార్థం శ్రీకాంత్ చారి జంక్షన్ గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా నూతనంగా నిర్మించిన ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ కు మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్ గా నామకరణం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశమైన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ.. ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంత్ చారి జంక్షన్, ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ కు మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్ గా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News