దుకాణం ఎదుట చెత్త.. షెట్టర్లకు తాళం

సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా పట్టణానికి అవార్డు వచ్చింది.

Update: 2023-03-02 05:08 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా పట్టణానికి అవార్డు వచ్చింది. అయితే సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి సూచించారు. మార్కెట్ ఏరియాలో షాపు యజమానులు ఇష్టానుసారంగా రోడ్లపై చెత్త వేశారని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బందితో సహా మార్కెట్ ఏరియాకి వెళ్లి ఎవరి షాపు ముందు చెత్తను వేశారో వారితోనే తీయించారు.మున్సిపల్ ట్రాక్టర్ తెప్పించి అందులో వేయమని చెప్పి వారి యొక్క షాపులకు తాళాలను సిబ్బందితో వేయించారున. అంతా క్లీన్ చేసిన తర్వాత షాప్ తాళాలు ఇస్తామని అన్నారు. ఇక ముందు ఇలాంటి సంఘటన ఎదురైతే కఠినమైన చర్యలు తీసుకొని భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

కఠినంగా వ్యవహరించాలి.. 

సిరిసిల్ల పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. కొత్త బస్టాండ్‌ ముందర మైదానంలో విచ్చలవిడిగా చెత్త వేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో రోడ్లకు ఇరువైపులా చెత్త పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చెత్తను ప్లాస్టిక్ సంచుల్లో నింపి మున్సిపల్ ట్రాక్టర్‌కు ఇస్తారని ఇక ముందు అలా చేయాలంటే భయం వేసేలా కఠిపమైప చర్యలు ఉండాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తీసుకుంటున్న చర్యలు భాగున్నాయని ప్రజలు అభినందిస్తున్నారు. 39 వార్డులలో ఇలాగే కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News