భారీ వర్షం ఎఫెక్ట్.. ఎక్కడికక్కడ ఆగిపోయిన నిమజ్జన ఊరేగింపులు

గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ నుంచి ఎలాంటి సూచనలు లేకపోయినా సడన్‌గా ఆఫీస్ వేళలో వర్షం కురవటంతో రాకపోకలు సాగించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

Update: 2023-09-27 12:29 GMT

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ నుంచి ఎలాంటి సూచనలు లేకపోయినా సడన్‌గా ఆఫీస్ వేళలో వర్షం కురవటంతో రాకపోకలు సాగించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మెయిన్ రోడ్డు చౌరస్తాలలో భారీగా వరద నీరు చేరింది. పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్, బషీర్బాగ్, నాంపల్లి, కూకట్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఇక, ఐటీ కారిడార్‌లో ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా జంక్షన్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఖైరతాబాద్ బడా గణపయ్యను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూనే దర్శించుకున్నారు.

Tags:    

Similar News