ఎన్నికల ఖర్చును ఆడిట్ చేయించండి.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్

ఎన్నికలపై ప్రభుత్వం తరపున చేసే ఖర్చు, లెక్కలు ఆడిట్ చేయరని, దీనిని ఆసరగా తీసుకొని విచ్చలవిడిగా డబ్బు దుబారా చేస్తున్నట్లు అనుమానం ఉందని, రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్నికల్లో చేసే ఖర్చును ఏజీ(ఆడిట్ జనరల్)తో ఆడిట్ చేయించాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి కోరారు.

Update: 2024-05-16 14:32 GMT

దిశ,తెలంగాణ బ్యూరో: ఎన్నికలపై ప్రభుత్వం తరపున చేసే ఖర్చు, లెక్కలు ఆడిట్ చేయరని, దీనిని ఆసరగా తీసుకొని విచ్చలవిడిగా డబ్బు దుబారా చేస్తున్నట్లు అనుమానం ఉందని, రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్నికల్లో చేసే ఖర్చును ఏజీ(ఆడిట్ జనరల్)తో ఆడిట్ చేయించాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి కోరారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి గురువారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి 40 లక్షలకు మించకుండా ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఖర్చుల వివరాలను సేకరించేందుకు అబ్జర్వర్‌ను కూడా నియమించడం జరిగిందన్నారు.

ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక్షన్ 78 ప్రకారం ప్రతి అభ్యర్థి ఎన్నికలు ముగిసిన నెలలోపు ఎన్నికల్లో ఖర్చు వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాలన్నారు. ఆ వివరాలను ఎన్నికల కమిషన్ అభ్యర్థుల ఖర్చు వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచడం జరుగుతుందని తెలిపారు. కానీ ఎన్నికల సందర్భంలో అధికారులు ఖర్చు చేసిన వాటిలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లను వివరాలను అడిగితే చాలా మంది ఇవ్వలేదని, చివరికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని అడిగితే రూ.701.11కోట్లు ఎన్నికల ఖర్చు కింద విడుదల చేశామన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 701.11కోట్లు ఖర్చు చేస్తే ప్రతి నియోజకవర్గానికి సగటున రూ.5.9కోట్లు ఖర్చుచేయడం జరుగుతుందన్నారు. ఇది అభ్యర్ధి ఖర్చుకంటే ఎక్కువ అని, దీనిపై సమగ్ర విచారణ చేయించాలని కోరారు. అభ్యర్థుల లెక్కలు దేనిదేనికి ఖర్చు చేసింది వెబ్ సైట్లో ఉంచినట్లు ప్రభుత్వపరంగా చేసిన ఖర్చుల వివరాలను వెబ్ సైట్లో ఉంచాలని డిమాండ్ చేశారు.

Read More...

ఇన్‌కమ్‌పై సీఎం ఫోకస్.. మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ 

Tags:    

Similar News