Venkaiah Naidu: వారికి కష్టం అంటే ఏంటో తెలియాలి.. వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో లోక్‌ మంథన్(Lok Manthan) కార్యక్రమాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ప్రారంభించారు.

Update: 2024-11-21 06:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో లోక్‌ మంథన్(Lok Manthan) కార్యక్రమాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతరం మాట్లాడుతూ.. మూలాలకు వెళ్లాలని చెప్పేందుకే ఈ కార్యక్రమం అని అన్నారు. భారత సంస్కృతిని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. ప్రకృతిని ఎదుర్కోవడం అందరి బాధ్యత అని గుర్తుచేశారు. అమ్మ భాషకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పిల్లలను సున్నితంగా పెంచకుండా.. చిన్న తనం నుంచే కష్టం అంటే ఏంటో తెలిసేలా పెంచాలని అన్నారు.

కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలని సూచించారు. పెద్దలను గౌరవించేలా పిల్లలను తయారు చేయాలని అన్నారు. కాగా, ఈ కార్యక్రమం శిల్పారామంలో గురువారం నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరుగనుంది. 2016లో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో లోకమంథన్‌ను వైభవంగా నిర్వహించారు. ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తోంది. ఆ రకంగా ఇది నాలుగో లోక్‌మంథన్‌. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News