మునుగోడుపై ఎందుకీ వివక్ష: రాజగోపాల్ రెడ్డి
టీఆర్ఎస్ సర్కార్‌పై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్‌పై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. మునుగోడు ప్రజల పట్ల ఎందుకీ వివక్ష అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.12 లక్షలు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, శివన్నగూడెం భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 5.5 లక్షలు ఇస్తోందని మండిపడ్డారు. శివన్నగూడెం భూ నిర్వాసితుల అంటే ఎందుకంత వివక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మావి భూములు కాదా.. మేము రైతులం కాదా'' అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
మునుగోడు ప్రజల పట్ల ఎందుకీ వివక్ష ❓
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) September 13, 2022
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 12 లక్షలు...
శివన్నగూడెం భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 5.5 లక్షలు...❗
మావి భూములు కాదా...⁉️
మేము రైతులం కాదా...⁉️
@TelanganaCMO @trspartyonline pic.twitter.com/NCMAyiMCu5