కల్వకుంట్ల సామ్రాజ్యంలో సోమేశ్ కుమార్ పాత్ర అదే: మాజీ ఎంపీ బూర
కురు సామ్రాజ్యంలో శకుని లాగా, కల్వకుంట్ల సామ్రాజ్యంలో మాజీ సీఎస్, సీఎం కేసీఆర్ ప్రధాన సలహదారుడు సోమేశ్ కుమార్ పాత్ర ఉండబోతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కురు సామ్రాజ్యంలో శకుని లాగా, కల్వకుంట్ల సామ్రాజ్యంలో మాజీ సీఎస్, సీఎం కేసీఆర్ ప్రధాన సలహదారుడు సోమేశ్ కుమార్ పాత్ర ఉండబోతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. తెలంగాణ ప్రజలను అన్ని విధాలా పట్టి పీడించే స్కీం అండ్ స్కాంకు సూత్రధారి అతనే అని ఆరోపించారు. 5, 4 లక్షల కోట్ల అప్పు చేపించి, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వానికి గుదిబండ కావడమే వారి పన్నాగమన్నారు. తెలంగాణ ప్రజలు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే రూ.45 వేల కోట్ల ఆదాయం ద్వారా ఇచ్చే సంక్షేమ పథకాలతో సంతృప్తి చెందక, నిజాన్ని గుర్తించి ఒక నియంతృత్వ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం తెలంగాణ ప్రజల అవసరమని పేర్కొన్నారు.
కమలానికి ఓటు, తెలంగాణకు రామ రక్షా, డబల్ ఇంజిన్ గ్రోత్, యువతకు భవిష్యత్తు అని కేసీఆర్ మత, కుల రాజకీయాలకు స్వస్తి అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా రైతుబంధు ప్రారంభమై నేటికి ఐదేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ స్పందిస్తూ.. రైతు బందునా? భూమి బందునా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తెచ్చే ప్రతి పథకం పేదవారికి మొదలు చెందాలని, ఉన్నవాడికి తర్వాత అని తెలిపారు. రైతుబంధు వాస్తవాలపై బీజేపీ తరపున తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
కురు సామ్రాజ్యంలో శకుని లాగ, కల్వకుంట్ల సామ్రాజ్యంలో సోమేశ్ పాత్ర. తెలంగాణను , తెలంగాణ ప్రజలను అన్ని విధాలా పట్టి పీడించే scheme & scams కు సూత్రధారి . 5. 4 లక్షల కోట్ల అప్పు చేపించి, భవిషత్తులో వచ్చే ప్రభుత్వానికి గుదిబండ కావడమే వారి పన్నాగం.
— boora narsaiah goud (@NarsaiahBoora) May 11, 2023
తెలంగాణ ప్రజలు మద్యం అమ్మకాల… pic.twitter.com/Ig00tzhefc