Jagga Reddy: కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు

Update: 2024-07-25 13:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశామని.. వ్యవసాయానికి ఏకంగా రూ.72 వేల కోట్లు కేటాయించి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వమని నిరూపించుకుందని అన్నారు. ఊహల బడ్జెట్ కేసీఆర్‌ది.. వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్‌దన్నారు. కేసీఆర్ ఆలోచన అప్పుల మీద అయితే.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలోచన రాష్ట్ర అభివృద్ధి అని కౌంటర్ ఇచ్చారు.

బడ్జెట్‌లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కాంగ్రెస్ భారీగా నిధులు కేటాయించిందని.. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.10 వేల కోట్లతో హైదరాబాద్‌ దశ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుంటే.. కేసీఆర్‌కి కుళ్లు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,91, 059 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేయగా.. తాజాగా జగ్గారెడ్డి ఆయన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 


Similar News