సీఎం రేవంత్ రెడ్డి కలుస్తా.. మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రకటన

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కలుస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రకటించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

Update: 2024-02-01 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కలుస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రకటించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముంది అని వ్యాఖ్యానించారు. గతంలో ఇద్దరం టీడీపీలో కలిసి పనిచేసిన వాళ్లమే అని అన్నారు. చర్చకు తావులేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తా అని చెప్పారు. తాము ఓడిపోతామని.. కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో తాము ఇంకా షాక్‌లోనే ఉన్నామని చెప్పారు. ఆ షాక్‌ నుంచి ఒక్కొక్కరం మెల్లగా తేరుకుంటున్నామని అన్నారు.

‘మల్కాజిగిరి ఎంపీగా నన్నే పోటీ చేయమన్నారు.. కానీ, నేను టికెట్‌ను నా కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నాను’ అని అన్నారు. టికెట్ ఎవరికిచ్చినా బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం చేస్తా అని అన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సీఎంను కలుస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా ఇప్పటికే సీఎం రేవంత్‌ను కలిశారు. తాజాగా.. మరో ఎమ్మెల్యే మల్లారెడ్డి కలుస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. నిజంగా అభివృద్ధి కోసమే కలుస్తున్నారా? వ్యూహాత్మకంగా కలుస్తారా? అనేది సందిగ్ధంగా మారింది.

Tags:    

Similar News