MLA మల్లారెడ్డి మరో సంచలనం.. ఆ రెండ్రోజులు సెలవు కావాలని స్పీకర్‌కు రిక్వెస్ట్

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు. వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకోవడంలో ముందుంటారు.

Update: 2024-02-12 11:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు. వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకోవడంలో ముందుంటారు. ముఖ్యంగా ‘పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డ.. పైకొచ్చిన’’ డైలాగ్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పేరిట ఉన్న మీమ్స్‌ మిలియన్ల లైక్స్ సాధిస్తున్నాయి. అయితే, ఏ కార్యక్రమానికి వెళ్లినా తన మార్క్ స్పీచ్‌తో ఆకట్టుకునే మల్లారెడ్డి.. మరోసారి క్రేజీ స్పీచ్ ఇచ్చారు. ఇది ఎక్కడో కాదు.. స్వయంగా రాష్ట్ర అసెంబ్లీలో రెచ్చిపోయారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14, 15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయని అన్నారు.

కాబట్టి ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని అనూహ్యంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. దీంతో స్పీకర్ సహా అధికార, విపక్ష ఎమ్మెల్యేలంతా చిరునవ్వు చిందించారు. అంతకుమందు అసెంబ్లీలో బడ్జెట్, కృష్ణా జలాలపై సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 2024- 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించారు. దీనిపై వాడివేడి చర్చ జరగ్గా.. హీటెక్కిన సభలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూల్ చేశాయి.

Tags:    

Similar News