అమెరికాలో మల్లారెడ్డి హడావిడి.. ఎందుకో తెలుసా?

విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి అమెరికాలో సందడి చేశారు.

Update: 2024-05-31 10:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి అమెరికాలో సందడి చేశారు. అమెరికాలో జరుగుతున్న 2024 అంతర్జాతీయ విద్యా సదస్సులో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న పెద్ద యూనివర్సిటీలు ఈ సదస్సుకు వచ్చాయని తెలిపారు. చైనా, జపాన్, పోర్చుగల్, భారత్ దేశాల్లో ఉండే వర్సిటీలు వారి వారి స్టాల్స్ ఏర్పాటు చేశారని, కోర్సుల గురించి ప్రెసెంట్ చేస్తున్నారని తెలిపారు. ఇందులో తెలంగాణ నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన స్టాల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇది ఎంతో మంచి విషయమని, పెద్ద పెద్ద యూనివర్సిటీలతో ఎక్స్‌చేంజ్ ఆఫర్స్, వారి కోర్సులు, న్యూ ఎడ్యూకేషన్ పాలసిని మల్లారెడ్డి యూనివర్సిటీలోకి తీసుకరావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఐటీ పరిశ్రమలో తెలుగు వాళ్లే అమెరికాలో ఎక్కువగా ఉన్నారన్నారు. ప్రపంచానికి తగ్గట్టుగా యువతను తయారు చేసే డిజిటల్ హెల్త్ లాంటి కొత్త కోర్సులను మల్లారెడ్డి వర్సిటీలో తేబోతున్నట్లు వెల్లడించారు. అమెరికా తర్వాత హైదరాబాదే ఎడ్యుకేషన్‌లో నంబర్ వన్ అవుతదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి పలు స్టాల్స్‌ను సందర్శించారు.

Tags:    

Similar News