మూసీ నదిపై మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్

మూసీనది(Musi River)పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు.

Update: 2024-10-18 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : మూసీనది(Musi River)పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీకి మూటలు పంపడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ ముందు పెట్టుకుందని అన్నారు. ప్రెజెంటేషన్ పేరుతో రేవంత్‌ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకొని పరువు తీసుకున్నారని పేర్కొన్నారు. అసలు సర్వే చేయకుండానే చేశానని అబద్దాలు చెప్పారని మండి పడ్డారు. మూసీ బ్యూటిఫికేషన్ కోసం కాదని లూటిఫికేషన్ అని, ఈ ప్రాజెక్ట్ ను అడ్డం పెట్టుకొని రూ.లక్షన్నర కోట్ల స్కామ్ కు రేవంత్ రెడ్డి తెర లేపారని అన్నారు.

1908 మూసీ వరదల అనంతరం హైదరాబాద్ ను కాపాడేందుకు నిజాం ప్రణాళిక రచించాడని.. అందులో భాగంగా నిర్మించినవే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక రూ.16,634 కోట్లతో మూసీ ప్రక్షాళనకు డీపీఆర్ సిద్దం చేశామని, మూసిపై ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మించాలని నిర్ణయించామని తెలియజేశారు. మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని సూచించారు.   


Similar News