జూన్ 2 వరకే హైదరాబాద్ రాజధాని: కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది జూన్ 2

Update: 2024-04-28 14:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ఏడాది జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకునేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. బీజేపీ అరాచకాలను అడ్డుకునే శక్తి బీఆర్ఎస్‌కే ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2026 నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ (డీలిమిటేషన్)లో తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి కూడా బీఆర్ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. బీజేపీ రాజ్యాంగం మార్చకుండా ఆపే పవర్ బీఆర్ఎస్‌కే ఉందని చెప్పారు. ఏడాది లోపు కేసీఆర్ మళ్లీ తెలంగాణను శాసించే రోజులు రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ మళ్లీ తెలంగాణను శాసిస్తాడని కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్‌లో సంచలనం రేపుతున్నాయి.  

Read More..

'రుణమాఫీ చేయమంటే ఒట్ల పేరుతో రేవంత్ రెడ్డి కొత్త డ్రామా' 


Similar News