రేవంత్ సర్కార్.. ఒక బోగస్ సర్కార్.. మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల

Update: 2024-05-24 10:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలుపునూ కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఒక బోగస్ సర్కార్ అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీపై అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేసిందని నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని.. నిరుద్యోగులను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి.. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కేవలం ఒకటే అమలు చేశారని.. మిగిలిన ఐదు మాటలకే పరితమయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించి.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.


Similar News