రేవంత్ రెడ్డి నన్ను కలిసే అవకాశం ఇయ్య..! కాలమే డిసైడ్ చేస్తుందని జగదీశ్ రెడ్డిపై నెటిజన్ల సెటైర్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిన సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిశామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడు చెప్పుకొచ్చారు. మరో వైపు బీఆర్ఎస్‌లోని ఐదుగురు ఎంపీలు, పలువురు కీలక నేతలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ చానల్ ఇంటర్వ్యూలో నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు.. మీరు కూడా మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలుస్తారా? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జగదీశ్ రెడ్డి సమాధానం చెబుతూ.. ‘రేవంత్ రెడ్డి నా ఇంటికి వచ్చి నన్ను కలవడానికి ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వను’ అని నవ్వుతూ సమాధానం చెప్పారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా నెటిజన్లు జగదీశ్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. కాలమే డిసైడ్ చేస్తుంది.. జగదీశ్ రెడ్డి ఎవరు ఎవరిని కలుస్తారు అనేది వెయిట్ చేయండని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి మాజీ సీఎంతో కేసీఆర్‌తో జగదీశ్ రెడ్డి బంధం స్ట్రాంగ్‌గా ఉందని, బీఆర్ఎస్ లోనే ఆయన కొనసాగుతారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.