స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. పోలీసుల తీరును ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
హుజురాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) దళిత బంధు రెండో విడత నిధుల విడుదల కోసం ధర్నా చేశారు.
దిశ, వెబ్ డెస్క్: హుజురాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) దళిత బంధు రెండో విడత నిధుల విడుదల కోసం ధర్నా చేశారు. అయితే ఆయనను పోలీసులు బలవంతంగా అరెస్ట్(Arrest) చేసి.. కారులో కుక్కడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో హుటాహుటిన ఎమ్మెల్యేను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనను మాజీ మంత్రి హరీష్ రావు(Former minister Harish Rao) తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరుపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన తన ట్వీట్‌లో.. " అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, హుజురాబాద్(Huzurabad) చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని రాసుకొచ్చారు. అలాగే దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసినా తప్పా అని ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అంటు పోలీసులు తీరుపై మండిపడ్డారు. తెలంగాణలో ఉంది ప్రజా పాలన కాదు, రేవంత్ మార్కు రాక్షస పాలన, కాంగ్రెస్ మార్కు నిరంకుశ పాలన, ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి నిర్బంధ పాలన అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే పోలీసుల తీరుతో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత.. పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్(Congress) ప్రభుత్వానిదే అని, అరెస్ట్ చేసిన బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.