దోచుకోవడం, దాచుకోవడం కాదంటూ MLC కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-12-25 11:52 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాజకీయాలంటే దోచుకోవడం, దాచుకోవడం కాదని.. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమని స్పష్టం చేశారు. అధికారాన్ని ప్రజల కోసం వినియోగించాలి తప్పే స్వార్ధానికి కాదని అన్నారు. పదవులతో సంబంధం లేకుండా సేషన్ ఘన్ పూర్ నియోజవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. దాదాపు 15 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా లేనని, కానీ తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే ఇప్పుడు కనిపిస్తోందని అన్నారు. నియోజకవర్గ ప్రజలు కూడా ఇదే చెబుతున్నారని, ఇంతకంటే ఇంకేం కావాలని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించే కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారని రాజయ్య అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News