బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కేసీఆర్కు తాటికొండ రాజయ్య రాజీనామా లేఖ
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు.
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపించారు. బీఆర్ఎస్లో తనకు గౌరవం లేదని ఈ ఉదయం ఆవేదన చెందారు. గత ఆరు నెలలుగా తానూ మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పారు. టిక్కెట్ దక్కకున్నా పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నానన్నారు. అయినా అధిష్ఠానం నుంచి మాత్రం స్పందన కరువైందన్నారు.
అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా పార్టీలో కొనసాగిన రాజయ్య.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు అధిష్టానానికి పంపారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ కేటాయించేందకు అధిష్టానం సుముఖంగా లేకపోవడంలో ఇక గుడ్ బై చెప్పడమే సరైన నిర్ణయం అని భావించి పార్టీ మార్పుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో మాట్లాడి తాజాగా రాజానామా చేశారు. ఈ నెల 10వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతారని సమాచారం.