మంత్రి కోమటిరెడ్డికి BRS మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటర్

మంత్రి కోమటిరెడ్డికి బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-07-02 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డికి బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. నల్లగొండలో రూ.100 కోట్లకు ఎకరం పలికే భూమి ఉందా అని భూపాల్ రెడ్డి ప్రశ్నించారు. మిగతా పార్టీల ఆఫీసులకు భూమి కేటాయించినట్లే బీఆర్ఎస్ పార్టీకి భూ కేటాయింపు జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం డబ్బు కూడా చెల్లించామన్నారు. పార్టీ ఆఫీసుకు సీసీఎల్‌ఏ అనుమతులు కూడా వచ్చాయన్నారు. ప్రభుత్వ భూమిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నిర్మించినా ఓపెన్ చేసుకోని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. ఇక, ఇదే అంశంపై నిన్న మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మించారని ఆరోపించారు. వంద కోట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ఇంద్రభవనం లాంటి పార్టీ ఆఫీసు కట్టడంపై మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. వెంటనే బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

Similar News