తెలంగాణ విద్యారంగంలో పెను మార్పులు.. సర్కార్ కీలక నిర్ణయం

కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-09-03 13:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీ కోసం ఈ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్మన్ సహా ముగ్గురు సభ్యులతో కమిషన్‌ ఏర్పాటైంది. అతి త్వరలోనే చైర్మన్‌ను, కమిషన్‌ను సభ్యులను నియమించనుంది. చైర్మన్, స‌భ్యులు రెండేండ్ల పాటు ఈ ప‌ద‌వుల్లో కొన‌సాగ‌నున్నారు.

రాష్ట్రంలో విద్యారంగంలో మార్పులు తీసుకురావడంతో పాటు బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు. కాగా, రాష్ట్రంలో విద్యా వ్యవ‌స్థ బ‌లోపేతానికి కృషి చేస్తున్నామని.. అందులో భాగంగానే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యకు బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. తాను, ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క ఇద్దరం ప్రభుత్వ పాఠ‌శాలల్లోనే చ‌దువుకున్నామ‌ని, క‌చ్చితంగా ప్రభుత్వ విద్యా వ్యవ‌స్థ బ‌లోపేతానికి కృషి చేస్తామని రేవంత్ తెలిపారు.


Similar News