కేటీఆర్ వ్యాఖ్యలపై.. మహిళా కమిషన్ కేసు నమోదు చేయాలి! మంత్రి పొన్నం

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Update: 2024-08-15 13:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడాన్ని.. కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడని, మంత్రి పొన్నం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై కేంద్ర, రాష్ట్ర మహిళా కమీషన్లు వెంటనే స్పందించి, కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం ప్రారంభించిన తొలి నుంచి కేటీఆర్ తీరు ఇలానే ఉందని, మహిళలపై ఇలాంటి దూషణలను ఇప్పటికైనా మానుకోవాలని అన్నారు మంత్రి పొన్నం. కాగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కేటీఆర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తాము వద్దనట్లేదని, ఇంకా అవసరమైతే అదే బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు కూడా చేసుకోండని అన్నారు. దీనికొరకు అవసరమైతే ఒక్కో మహిళకు ఒక్కో బస్సుని కూడా పెట్టుకోండని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.  


Similar News