Secretariat: సెక్రటేరియట్ లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రంగంలోకి స్పెషల్ టీమ్స్

సెక్రటేరియట్ లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతున్నది.

Update: 2025-02-15 13:12 GMT
Secretariat: సెక్రటేరియట్ లో ఫుడ్ పాయిజన్ కలకలం..  రంగంలోకి స్పెషల్ టీమ్స్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో:  తెలంగాణ సెక్రటేరియట్ (Telangana Secretariat) లో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటనపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ రంగంలోకి దిగారు. సెక్రటేరియట్ కు ఆహార పదార్థాలు సరఫరా చేసే ఏజెన్సీ కిచెన్ లో ఇవాళ తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాల ముడిసరుకులు, ఆహార నాణ్యతను ఫుడ్ సేప్టీ ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. కాగా తెలంగాణలోని స్కూల్స్, హస్టల్స్ ను భయపెట్టిన ఫుడ్ పాయిజన్ ఘటనలు తాజాగా తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ కు పాకింది. సీఎంవో (CMO) తో సహా మంత్రుల (Ministers) పేషీలకు, కీలక శాఖ అధికారులకు నాసిరకం భోజనం సప్లై చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలువురు అధికారులకు ఫుడ్ పాయిజన్ కావడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి వెళ్లడంతో ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Tags:    

Similar News