బోధన్‌లో MLAకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు
అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలవడం కలకలం రేపింది.
దిశ, నిజమాబాద్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజవర్గంలోలో మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ప్రధానంగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్‌కు వ్యతిరేకంగా ప్రధాన కూడళ్లలో బోధన్ బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తడిసిన ధాన్యం కొంటానని చెప్పి 20 రోజులుగా అదృశ్యం అయ్యాడంటూ ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. షకీల్ అడ్రస్ ఎక్కడ అని రైతుల పేరుతో బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఫ్లెక్సీలు చించి వేసి పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. బుధవారం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నెల నిజామాబాద్ ఎంపీ ని టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. వాటికి వ్యతిరేకంగా బిజెపి నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో తొలిసారి ఒక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రానున్న రోజుల్లో ఈ టైప్ నిరసన తగులుతుందనది హాట్ టాపిక్ గా మారింది.
Also Read..
కొత్త సెక్రటేరియట్ మెయింటెనెన్స్ నెల ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!