ప్రయివేటు మెడికల్ కాలేజీల దోపిడీ.. నాలుగేండ్ల కోర్సుకు ఐదేండ్ల ఫీజు!

రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు మెడిక ల్ కాలేజీల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది.

Update: 2024-06-20 02:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు మెడిక ల్ కాలేజీల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. కా లేజీలన్నీ టీమ్‌గా ఏర్పడి విద్యార్థుల నుంచి అడ్డగోలుగా దోపి డీ చేస్తున్నాయి. నాలుగేళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఏకంగా ఐదేళ్ల ఫీజులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఫీజులు, స్టైఫండ్ రూపంలో లూటీ చేస్తూ విద్యార్థులను ఆగం చేస్తున్నాయి. ప్రతి ఏటా అదనంగా దాదాపు రూ.303 కోట్లు వసూలు చేస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నించిన విద్యార్థులపై ఏకంగా బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. మెజార్టీ ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో ఇదే వి ధానం అమలవుతున్నట్లు సమాచారం.

రాష్ట్ర సర్కార్ ఆదేశా లు, ఇక్కడి విద్యార్థుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకో కుండా, తామంతా నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలోకి వస్తామనే ధీమాతో ఇష్టరీతిలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోన్నది. ప్రయివేటు మెడికల్ కాలేజీల అన్యాయాలను పేరెంట్స్ నిలదీస్తే, వారి పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్న ట్లు తెలిసింది. టార్గెట్ చేసి మరీ సతాయిస్తున్నట్లు ఓ పేరెంట్ తెలిపారు. ఇదే అంశంపై గతంలో గ్రేటర్ హైదరాబాద్ నగర శివార ప్రాంతంలోని ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీలో విద్యా ర్థి సంఘాల ఆధ్వర్యంలో ఏకంగా ధర్నాలు చేసినట్లు తెలిసిం ది. అదనపు ఫీజు వసూళ్లపై కొందరు విద్యార్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన సంఘటనలు ఉన్నాయి. కోర్టులు మొట్టికాయలు వేసినా, ప్రయివేటు కాలేజీలు తమ దందాను యథేచ్ఛగా నిర్వహించడం గమనార్హం.

వన్ ఇయర్ ఎక్స్‌ట్రా ఇలా?

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 28 మెడికల్ కాలేజీలుండగా, వా టిలో 4,800 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటాలో 50 శాతం సీట్లు వెళ్లగా, మిగిలిన 2300 సీట్లలో బీ కేటగిరి కింద 1955, సీ కేటగిరిలో 345 సీట్లను భర్తీ చే స్తారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బీ కేటగిరి సీట్లకు ఏడాదికి రూ.11.25 లక్షలు ఉండగా, సీ కేటగిరిలో కాలేజీని బట్టి దాదాపు రూ.20 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయితే బీ, సీ కేటగిరి సీట్లలో అడ్మిషన్లు పొంది న విద్యార్థులంతా ప్రతి ఏటా నిర్దేశించిన ఫీజులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రయివేటు మెడికల్ కాలేజీ లు మాత్రం ఒక్కో ఏడాదిని అదనంగా తీసుకుంటున్నాయి. ఇలా అన్ని కాలేజీలు కలిపి బీ కేటగిరీలో దాదాపు రూ.219 కోట్లు, సీ కేటగిరిలో రూ.84.52 కోట్లు కొట్టేస్తున్నాయి.

స్టైఫండ్‌లోనూ అదే విధానం?

ఇక ప్రభుత్వంతో పాటు ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో విధి గా స్టైఫండ్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ చెబుతున్నాయి. ఫస్ట్ ఇయర్ ఫీజీలకు రూ.58,289, సెకండ్ ఇయర్‌కు రూ. 61,528, థర్డ్ ఇయర్‌కు రూ.64,767 చొప్పున స్టైఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభు త్వ, ప్రయివేటు కలిపి 2649 పీజీ సీట్లు ఉన్నాయి. వీటిలో నాన్ క్లినికల్ సీట్లు దాదాపు మూడు వందల వరకు ఉండగా, వీటిలో ఎవ్వరూ చేరడం లేదని తెలిసింది. ప్రయివేటులో దాదాపు 1500 పీజీ సీట్లు ఉన్నాయి. మూడేళ్ల పీజీ కోర్సును పరిగణలోకి తీసుకుంటే ఏటా దాదాపు మూడు వేల మంది పీజీలకు స్టైఫండ్ రూపంలో ఆయా మెడికల్ కాలేజీల యాజమాన్యాలు దాదాపు రూ.73.83 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

కానీ మెజార్టీ మెడికల్ కాలేజీలు విద్యార్థులకు స్టైఫండ్‌ను చెల్లించడం లేదు. అయితే ఎన్ఎంసీ దృష్టిని మరల్చేందుకు కొన్ని ప్రయివేటు మెడికల్ కాలేజీలు తెలివిగా, విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో స్టైఫండ్‌ను జమ చేసి, ఆ వెంటనే మళ్లీ తీసేసుకుంటున్నాయి. ఇందుకోసం జమ చేసే కంటే ముందే కాలేజీల యాజమాన్యాలు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థుల నుంచి ఏటీఎమ్ కార్డులను తీసుకుంటున్నాయి. మరో వైపు ఎంబీబీఎస్ విద్యార్థుల ఇంటర్న్ షిప్‌లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ఒక్కో విద్యార్థికి ప్రతి నెలా రూ.25 వేలు స్టైఫండ్ ఇవ్వాలి. కానీ ప్రయివేటు కాలేజీలు ఇవి చెల్లించడం లేదు.

ఏకంగా బర్త్ పోర్టల్‌లోనే ఎంట్రీ?

మెజార్టీ ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో అతి తక్కువ డెలివరీలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వానికి మాత్రం ఫేక్ లెక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా బర్త్ పోర్టల్‌లోనూ డెలివరీ డేటా ఎంట్రీ చేస్తూ, ప్రయివేటు మెడికల్ కాలేజీలు అతి పెద్ద మోసానికి పాల్పడుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఇందుకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలన్నీ పాటిస్తేనే మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు వస్తాయి. ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం కాలేజీలన్నీ పక్కాగా మెయింటెన్ చేయాల్సిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ప్రయివేటు మెడికల్ కాలేజీలకు ఇప్పటికీ సరైన ఫ్యాకల్టీ లేదు. ఎన్ఎంసీ టీమ్స్ తనిఖీల సమయంలో అక్రమ పద్ధతిలో స్టాఫ్‌ను చూపిస్తూ మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అయితే ఇటీవల ఆధార్ బయోమెట్రిక్ అటెండెన్స్ రూల్ అమలవుతుండటంతో కొందరు ప్రయివేటు ఫ్యాకల్టీతో ముందస్తుగానే ఒప్పందాలు కుదుర్చుకొని, సిలికాన్ థంబ్‌లతో అటెండెన్స్ వేస్తున్నట్లు వైద్యవర్గాల్లో ప్రచారం ఉన్నది. ఇక ఓపీ, ఐపీ, ఆపరేషన్, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్, ల్యాబ్, ఫ్యాకల్టీ, బెడ్స్ ఇవన్నీ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం విధిగా మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్‌లో విధిగా డెలివరీలూ చేయాలి. దీంతో విద్యార్థుల లెర్నింగ్‌కు ఆస్కారం ఉంటుంది. కానీ ప్రైవేటు మెడికల్ కాలేజీలపై మానిటరింగ్ సరిగ్గా లేక ఇష్టరీతిలో కొనసాగుతున్నాయి.


Similar News