Fisheries Corporation: మత్స్యకారుల అభ్యున్నతికి నూతన పాలసీ!
రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి(Welfare And Development Of Fishermen)పై ప్రభుత్వం(Telangana Government) ఫోకస్ పెట్టింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి(Welfare And Development Of Fishermen)పై ప్రభుత్వం(Telangana Government) ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మత్స్యకారుల అభ్యున్నతికి నూతన పాలసీ(New Policy)ని తీసుకురావాలని సర్కార్ ప్లాన్ చేస్తోన్నది. దీనిలో భాగంగానే మత్స్సశాఖ కార్పొరేషన్ చైర్మన్(Chairman Of The Fisheries Corporation) మెట్టు సాయికుమార్(Mettu Saikumar) నేతృత్వంలో ఆఫీసర్ల బృందం బెంగళూరు(Bangalore), మైసూర్(Mysore) లో పర్యటించేందుకు సోమవారం వెళ్లనున్నది. మూడు రోజుల పాటు ఈ టీమ్ మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, మత్స్యకారులు, రీసెర్చ్ యూనిట్ల అధికారులతో చర్చించనున్నారు. బెంగళురు, మైసూర్ లో చెరువుల్లోని చేపల ఉత్పత్తిని పరిశీలించనున్నారు. అక్కడి సూపర్‌వైజర్లను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. ఆ తర్వాత బెంగళురు, మైసూర్ ఆఫీసర్లు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజేంటేషన్లలో పాల్గొననున్నారు. ఈ వివరాలన్నింటిని రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇక ఈ టూర్ లో చేపకంతో పాటు విక్రయాల ఔట్ లెట్ లను కూడా పరిశీలించనున్నారు. చేపల విక్రయాల ధరలు, మార్కెట్ సీజన్, లాభాలు, నష్టాలు వంటి అంశాలను కూడా తెలుసుకోనున్నారు.
ఆదాయం సమకుర్చుకోవడం ఎలా...?
ప్రస్తుతం మత్స్యశాఖ ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు నష్టాలు చవిచూస్తున్నది. దీంతో ప్రభుత్వంపై ఆధారపడకుండా బడ్జెట్ ను సమకూర్చుకోవాలని మత్స్సశాఖ ప్రయత్నిస్తున్నది. కర్ణాటక రాష్ట్రంలో మత్స్యశాఖ ప్రభుత్వ బడ్జెట్ తో సంబంధం లేకుండానే లాభాల బాటలో కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. దీంతో అక్కడి పర్యటనకు వెళ్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటిస్తామని, అన్ని స్టేట్ ల పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్టు రూపంలో అందజేస్తామని ఆయన వివరించారు. ఆ తర్వాత ఆదాయం సమకుర్చుకునేందుకు బెస్ట్ పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని వెల్లడించారు.
అన్ని చెరువుల్లో చేపల ఉత్పత్తి పెంచుతాం...మెట్టు సాయికుమార్ కుమార్, ఫిషరీస్ చైర్మన్
“రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 వేల చేరువులు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేక రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 6 వేల చెరువుల్లో మాత్రమే చేపల ఉత్పత్తి జరుగుతుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆరు వేల చెరువులకు మ్యాపింగ్ లేదు. దీంతో అన్ని చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించనున్నది. వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను అందజేస్తాం. ఇతర రాష్ట్రాల టూర్ తర్వాత మత్స్యకారుల సొసైటీలకు అవగాహన కల్పిస్తాం. ఇక గత పదేళ్లలో చేపల పెంపకం పేరుతో బీఆర్ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు లూటీ చేశారు. వాటన్నింటినీ లెక్కలతో సహా బయట పెడతాం’’