తొలిసారిగా ఆ బస్సులు! ఇక ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు రయ్.. రయ్
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో తొలిసారిగా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఆదివారం కరీంనగర్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ బస్సులను ప్రారంభించారు.
అత్యాధునిక హంగులతో వాడకంలోకి వస్తోన్న ఈ 35 బస్సుల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే సదుపాయాలు ఉన్నాయి. 41 సీటింగ్ సామర్థ్యమున్న ఎలక్ట్రిక్ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణించే సౌలభ్యం ఉంది. 2-3గంటల్లో వంద శాతం పూర్తి ఛార్జింగ్ అవ్వడమే కాకుండా క్యాబిన్, సెలూన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరాలను ఆదివారం ఎక్స్ వేదికగా సజ్జనార్ వెల్లడించారు.