టెన్షన్ పడకండి.. బీజేపీ కార్యకర్తకు బండ్ల గణేష్ కౌంటర్!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రముఖ యాక్టర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. రాహుల్ గాంధీపై ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Update: 2023-06-01 10:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రముఖ యాక్టర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. రాహుల్ గాంధీపై ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోను రీట్వీట్ చేస్తూ 'నా పేరు బండ్ల గణేష్.. నా కల రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడటం’ అంటూ గురువారం ఉదయం బండ్ల గణేష్ ట్వీట్టర్ లో రాసుకొచ్చారు. దీనిపై బీజేపీకి చెందిన ఓ కార్యకర్త రియాక్ట్ అవుతూ అన్న నేను అభిమానించే వాళ్లలో మీరు కూడా ఉన్నారు.

రాహుల్ గాంధీ ప్రధాని అనే ఈ ఒక్క విషయంలో మీ కల కలగానే మిగిరిపోతుందేమో అని అనుమానం కలుగుతోందన్నా అంటూ బదులిచ్చాడు. ఈ కామెంట్ పై బండ్ల గణేష్ స్పందించిన తీరు ఆసక్తిగా మారింది. టెన్షన్ పడకండి అన్న నా కల తప్పకుండా నిజమవుతుంది అంటూ ఫైర్ ఎమోజీని జోడిండిస్తూ అతడికి బండ్ల సమాధానం ఇచ్చారు. కాగా 2018 ఎన్నికల సమయంలో హడావుడి చేసిన బండ్ల ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు. మరో కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి, వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికలు జరుగుతాయనగా మరోసారి కాంగ్రెస్ ను సపోర్ట్ చేస్తూ ఆయన చేస్తున్న ట్వీట్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


Tags:    

Similar News