Fake information on Google: చిలకూరు బాలాజీ టైమింగ్స్‌పై గూగుల్ ఫేక్ సమాచారం..!

టెక్ దిగ్గజ సంస్థ, అతి పెద్ద సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్‌ను అడిగితే చెప్పలేందంటూ ఏది ఉండదు.

Update: 2024-06-07 13:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్ దిగ్గజ సంస్థ, అతి పెద్ద సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్‌ను అడిగితే చెప్పలేందంటూ ఏది ఉండదు. దాదాపు ప్రపంచంలోని అన్ని అంశాలకు చెందిన సమాచారం అంతా అందులోనే ఉంటుంది. విషయాలు తెలుసుకునేందుకు ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో కొన్నింటిపై ఫేక్ సమాచారం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రసిద్దిచెందిన చిలుకూరి బాలాజీ టెంపుల్ ఓపెన్ క్లోజ్ టైమింగ్స్ గూగుల్ లో తప్పుగా చూపిస్తున్నాయని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ఇవాళ ఆలయానికి వచ్చిన భక్తులకు సూచనలు చేశారు. గూగుల్లో చిలకూరు బాలాజీ టైమింగ్స్ తప్పుగా చూపిస్తున్నాయని, శనివారం, ఆదివారం ఆలయం క్లోజ్ ఉంటుందని చూపిస్తోందని ఇది ఎవరూ కూడా నమ్మవద్దని చెప్పారు. ఈ క్రమంలోనే గూగుల్‌ను నమ్ముకుంటే హుస్సేన్ సాగర్ లో దూకినట్లే అని గూగుల్‌ను విమర్శించారు. టెంపుల్ టైమింగ్స్ నీకు ఎవరు చెప్పారు గూగుల్? 4జీ, 5జీ నమ్మితే అదోగతి అని అన్నారు. గుగుల్‌కు అందరూ చిలుకూరు బాలాజీ టైమింగ్స్ అప్డేట్లు ఎవరడిగారని ఓ మెసేజ్ పెట్టాలని భక్తులకు సూచించారు.

Tags:    

Similar News