పైసల ఆశకు పరీక్ష పేపర్లు అమ్ముకున్నరు.. : కోందడరామ్

టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

Update: 2023-03-18 07:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. శనివారం గన్ పార్క్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ఆయన మెరుపు దీక్షకు దిగారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నాపత్రాలు లీక్ ఘటనతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ అంధకారంగా మారిందని దీనికి సీఎం బాధ్యత వహించాలన్నారు. రద్దు చేసిన పరీక్షలు రాసిన అభ్యర్థుల ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం సాధించుకుని ఏం లాభం అని ధ్వజమెత్తారు. కమీషన్ల ఆశకు సీఎం కేసీఆర్ పాజెక్టులను ముంచారని, పైసల ఆశలకు పరీక్ష పేపర్లను అమ్ముకున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News