Harish Rao:కొడంగల్ నుంచే ప్రజా తిరుగుబాటు మొదలు.. మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్
రాష్ట్ర ప్రభుత్వ పాలన పై ప్రజా తిరుగుబాటు మొదలైందని, అది కొడంగల్(Kodangal) నుంచే అని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Former minister Harish Rao) అన్నారు.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ పాలన పై ప్రజా తిరుగుబాటు మొదలైందని, అది కొడంగల్(Kodangal) నుంచే అని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Former minister Harish Rao) అన్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్(Vikarabad District Collector), అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. నేడు (గురువారం) హరీష్ రావు చర్లపల్లి జైలుకు వెళ్లి ఆయనతో మాట్లాడారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నుంచే తిరుగుబాటు మొదలైందని హరీష్ రావు పేర్కొన్నారు. అయితే ఆ తిరుగుబాటును సీఎం రేవంత్(CM Revanth) ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని చేసిన కొండగల్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన సేవ ఏంటి? అని ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి రైతులకు మద్దతిస్తే, కక్షపూరితంగా అరెస్టు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పేదల భూములు లాక్కోవడమేనా ఇందిరమ్మ రాజ్యం? అంటూ హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు.