ఎమ్మెల్యేలుగా ఓడినా.. MPలుగా గ్రాండ్ సక్సెస్

డబుల్ డిజిట్ లక్ష్యంతో పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చాటాలనుకున్న బీజేపీ ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయినా 8 సీట్లలో గెలుపుతో ఫుల్ జోష్‌లో ఉంది.

Update: 2024-06-05 02:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డబుల్ డిజిట్ లక్ష్యంతో పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చాటాలనుకున్న బీజేపీ ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయినా 8 సీట్లలో గెలుపుతో ఫుల్ జోష్‌లో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. పార్టీ సీనియర్లందరినీ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దింపింది. అయితే ఆ ఎన్నికల్లో ఓడి మళ్లీ ఎంపీ ఎన్నికలకు టికెట్ దక్కించుకున్న నలుగురికి నలుగురు విజయబావుటా ఎగురవేశారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్, మెదక్ ఎంపీగా రఘునందన్ రావు, మల్కాజిగిరి ఎంపీగా ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇందులో ఈటల రాజేందర్ 3,91,475 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బండి సంజయ్ 2,25,209 మెజారిటీతో, అర్వింద్ 1,09,241 మెజారిటీతో, రఘునందన్ రావు 39,139 మెజారిటీతో విజయం సాధించారు.


Similar News