కేంద్ర బృందాన్ని కలసిన ఈటెల రాజేందర్..

రాష్టంలో వరద వల్ల సంభవించిన నష్టాన్ని తెలుసుకునేందుకు వచ్చిన కేంద్ర బృందాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గురువారం ఓ హోటల్‌లో కలిశారు.

Update: 2023-08-03 16:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో వరద వల్ల సంభవించిన నష్టాన్ని తెలుసుకునేందుకు వచ్చిన కేంద్ర బృందాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గురువారం ఓ హోటల్‌లో కలిశారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి నది పక్కన ప్రాంతాల్లో వరదల వల్ల భారీ నష్టం జరిగిందని తెలిపారు. రైతాంగానికి పంటపొలాలు నీట మునిగాయని రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలనీ డిమాండ్ చేశారు. భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ లేకపోవడం వల్ల 41 మంది చనిపోయారని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని వరద నష్టాలపై సమగ్ర నివేదిక కేంద్ర బృందానికి ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయసహకారాలు అందించాలని కోరడం జరుగుతుందని అయన చెప్పారు. పంట నష్టం, వరదల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారని కొన్ని ప్రాంతాల్లో తానూ, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహితం పర్యటించడం జరిగిందని తెలిపారు. నష్ట వాటిల్లిన ప్రాంతాలపై తయారు చేసిన రిపోర్ట్‌ను కేంద్ర బృందానికి కలిసి ఇచ్చేందుకు రావడం జరిగిందని తెలిపారు. కేంద్ర బృందంతో చీఫ్ సెక్రెటరీ మీటింగ్ జరుగుతున్నా కారణంగా కలవలేదని.. ఇళ్ళు మునిగిన వారికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదన్నారు.


Similar News