ఆగస్ట్ 16న హైదరాబాద్ లో అమెరికా ఎడ్యుకేషన్ ఫెయిర్

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.

Update: 2024-08-12 17:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఆగస్టు 16 నుండి 26 వరకు పదిరోజులపాటు ఎడ్యుకేషన్ యూఎస్ఏ నిర్వహిస్తున్నట్టు అమెరికా రాయబార ప్రాంతీయ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో ఉన్నత చదువుల పూర్తి వివరాల సమాచారం విద్యార్థులకు తెలియజేయనున్నారు. ఇందులో భాగంగా ఆగస్ట్ 16న హైదరాబాద్, 17న చెన్నైలో, తరువాత బెంగుళూర్, కలకత్తా, అహ్మదాబాద్, పూణె, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని చెన్నై కాన్సులేట్ జనరల్ తెలిపారు. అమెరికాలోని దాదాపు 80 కి పైగా యూనివర్సిటీలు, కాలేజీల ప్రతినిధులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. వీటికి ప్రవేశం ఉచితమని, రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవాలని అన్నారు. మరింత సమాచారం కోసం తమ వెబ్సైట్ ను సంప్రదించాలని తెలిపింది. 


Similar News