డిజిటల్ ఎవిడెన్స్ రికవరీపైనే ఈడీ స్పెషల్ ఫోకస్!

లిక్కర్ స్కామ్‌లో కవిత సహా మొత్తం 36 మంది ఏడాది కాలంలో 170 మొబైల్ ఫోన్లను మార్చినట్లు ఈడీ క్లారిటీకి వచ్చింది.

Update: 2023-03-22 02:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత సహా మొత్తం 36 మంది ఏడాది కాలంలో 170 మొబైల్ ఫోన్ల(హ్యాండ్ సెట్)ను మార్చినట్లు ఈడీ స్పష్టమైన నిర్ధారణకు వచ్చింది. ఆ ఫోన్ల ఐఎంఈఐ డీటెయిల్స్ సైతం రాబట్టింది. 2021 ఆగస్టు నుంచి 2022 సెప్టెంబరు వరకు వీరంతా మార్చిన ఫోన్లలో 17 మాత్రమే రికవరీ చేయగలిగినట్లు ఈడీ పేర్కొన్నది.

వీటిలోని డిజిటల్ ఎవిడెన్సులను సైతం అతి కష్టం మీద కొంత మేరకు సేకరించగలిగినట్లు పేర్కొన్నది. ఉద్దేశపూర్వకంగానే చాలా మంది ఫోన్లలోని ఆధారాలు దొరక్కుండా వాటిని ఫిజికల్‌గా ధ్వంసం చేయడమో లేక వివరాలు లభ్యం కాకుండా రీసెట్ చేయడమో చేశారని ఈడీ తన చార్జిషీట్‌లలో పేర్కొన్నది.

కవిత ఫోన్ల డేటా రికవరీపై దృష్టి

ఎమ్మెల్సీ కవిత సమర్పించిన పాత మొబైల్ ఫోన్లలోని డేటాను రికవరీ చేయడంపై ఈడీ దృష్టి పెట్టింది. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని భావిస్తున్నది. దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఫైనల్ కాకముందే డ్రాప్ట్ రూపంలో వాట్సాప్ చాటింగ్ ద్వారా లీక్ అయిందని, వాటి స్క్రీన్ షాట్లను ఈడీ స్పెషల్ కోర్టుకు సమర్పించింది.

కవిత మొబైల్ ఫోన్‌కు ఎలాంటి వివరాలు అందాయనే అంశంపై ఈడీ ఫోకస్ పెట్టి అందులో కిక్‌బ్యాక్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు డబ్బులు చేరవేయడంపై జరిగిన చాటింగ్ వివరాలను రాబట్టాలని భావిస్తున్నది. కవిత సమర్పించిన ఫోన్‌ల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పుడు ఏ మేరకు డేటాను రికవరీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రికవరీ ప్రక్రియ ఫోరెన్సిక్ డిపార్టుమెంటుకు కూడా సవాలుగా మారనున్నది.

Tags:    

Similar News