తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతకు ఈడీ నోటీసులు
తెలంగాణ కాంగ్రెస్ కీలకనేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు పంపారు. రేపు ఉదయం(మే 31) 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలకనేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు పంపారు. రేపు ఉదయం(మే 31) 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 2022 నవంబర్ 23న అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాలని అంజన్ కుమార్ యాదవ్‌కు ఈడీ నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. గత ఏడాది ఈ కేసులో ఈడీ విచారణకు మాజీ మంత్రి గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు. రూ.2 వేల కోట్ల విలువైన అసెట్స్, ఈక్విటీ లావాదేవీల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపించిన విషయం తెలిసిందే.