ED: ఐఏఎస్ అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశాలు

ఐఏఎస్ అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

Update: 2024-10-19 12:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఐఏఎస్ అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్ బీఆర్ఎస్ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అమోయ్ కుమార్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 23న ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో శంషాబాద్ లో 21 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేశారని, ధరణిలో లొసుగుల ఆధారంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారని ఆరోపణలు వచ్చాయి.   


Similar News