Etela Rajender: ఆ తర్వాతే బీజేపీ కొత్త అధ్యక్షుడు.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టుపై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-11 09:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో/ నల్గొండ బ్యూరో : బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యత్వాలు, మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీల తర్వాత రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడి పేరు అనౌన్స్ చేసే అవకాశం ఉందని అన్నారు. బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అంతా ఢిల్లీ పెద్దలు చూసుకుంటారని అన్నారు. పేపర్లలో, జీవీలలో ఏవేవో చెబుతుంటారని, పొలిటికల్ పార్టీల మీద ఇలాంటి చర్చలు జరగడం సహజం అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొంత టైమ్ ఇవ్వాలని ఇచ్చాం. కానీ 9 నెలలు గడిచినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ సక్రమంగా నిర్వహించలేకపోయిందని విమర్శించారు. అధికార పక్షం అన్నిట్లో రాజకీయాలు మాట్లాడటమే తప్ప ప్రజల సమస్యలు, ఆరోగ్యం పట్ల పట్టించుకునే దాఖలాలు లేవు కనిపించండ లేదని ధ్వజమెత్తారు. ప్రజా ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని లేకపోతే అనేక రకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఆసుపత్రుల్లో మందుల కొరత:

గత నెల రోజులుగా గ్రామాలలో, బస్తీలలో ఎక్కడికి వెళ్లినా ఔషధాల కొరత ఉందని విమర్శించారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్స్ లో కిట్స్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రావడంలేదని చెప్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వైరల్ ఫీవర్స్, కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని ఇలాంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ పని చేయడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ ను ఉపయోగించుకోకుండా ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో వ్యాపిస్తున్న జ్వరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని సమస్యలను కేవలం పేపర్ పై రాయించుకోవడం, సమస్య పరిష్కారిస్తామని చెప్పడం తప్ప పరిష్కరించడం లేదన్నారు. తాము ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో పర్యటించామని.. ఎక్కడికి పోయినా వరద సమస్య కన్నా ఆరోగ్య సమస్యలే ఎక్కువ చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా  మీనమేషాలు లెక్కపెట్టకుండా హెల్త్ డిపార్ట్మెంట్ పై దృష్టి సారించాలి. ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామని చెప్పిన సీఎం ఆప్రజలకు అందుబాటులో ఉండటం లేదని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం లేదన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు, శానిటైజేషన్ వర్కర్స్ మీదనే దవాఖానాలు ఎక్కువ నడుస్తాయని ప్రభుత్వం వెంటనే వారికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కోవిడ్ వచ్చినప్పుడు కొత్త దవఖానాలు, హాస్పిటల్స్ ఎక్స్ పెన్షన్ చేశామని, పదిమంది ఉన్న దగ్గర 20 మందిని టెంపరరీ బేసిస్సులో తీసుకొని పనిచేయించామని అన్నారు. కోవిడ్ తర్వాత వారందరూ ఖాళీగా ఉంటున్నారు. పాత వాళ్లకు జీతాలు సకాలంలో ఇస్తూ, ఎక్కడెక్కడ దవాఖానల్లో ఏ రకమైన స్టాఫ్ అవసరం ఉందో యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేసుకొని పేదలకు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. డయాగ్నస్టిక్ సెంటర్స్ లో కిట్స్, పరికరాలు, కెమికల్స్ లేవు. వాటి వల్ల డిటెక్షన్ లేట్ అవ్వడం వల్ల రోగాలు ఎక్కువ వ్యాప్తి చెందుతున్నాయని, మనుషులు చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నారు. కాబట్టి త్వరగా పరీక్షలు చేయటం కోసం వాటికి అవసరమైన పరికరాలను అందించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలలో, వాటికి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ లో డాక్టర్స్, టీచింగ్ స్టాఫ్ లేరని, టీచింగ్ హాస్పిటల్స్ ను పటిష్టం చేస్తే కొన్ని వేల బెడ్లు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. అందువల్ల టీచింగ్ హాస్పిటల్స్ లో కనీస స్టాఫ్ ను ఇచ్చి హాస్పిటల్స్ అన్నీ కూడా సక్రమంగా నడిచే ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న ఆసుపత్రుల్లో బెడ్లు పెంచారు కానీ వాటికి అసరమైన స్టాఫ్ పెంచలేదని టెంపరరీ బేసిస్ లో రిక్రూట్మెంట్ చేసుకొని పూర్తి బెడ్ల సామర్థ్యంతో వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

యూసీ ఇస్తే కేంద్రం నిధులు:

కేంద్ర ప్రభుత్వం అమలయ్యే బడ్జెట్ పెడుతుంది తప్ప లెక్కల గారడీలు చేయదని ఈటల అన్నారు. రాష్ట్రాలు కేంద్ర ఇచ్చిన నిధులు ఖర్చు చేసినట్లు యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. వీళ్లు ఆ డబ్బును డైవర్ట్ చేసుకొని వాడుకొని ఇచ్చే పరిస్థి లేదన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే రాష్ట్రాలనికి మళ్లీ పైసలు వచ్చే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్రం దగ్గర ఎన్ డీఆర్ఎఫ్ కింద రూ.1,365 కోట్లు అందుబాటులో ఉంచినప్పటికీ ప్రస్తుతం అందులో ఐదు పైసలు కూడా లేవన్నారు.వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో కేంద్ర ప్రభుత్వానికి యూసీ ఇవ్వలేకపోయిందన్నారు. అందుకే కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుందని చెప్పారు.


Similar News